Nikhil Siddarth's Karthikeya 2 Twitter Review: చివరిగా అర్జున్ సురవరం అనే సినిమాతో హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతంలో సూపర్ హిట్ గా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్ల సమస్య కారణంగా పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు శనివారం నాడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతుందని మొదటి ప్రకటించినా తమిళనాడులో మాత్రం థియేటర్లలో విడుదల చేయడం లేదు. మిగతా అన్ని భాషల్లోనూ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రంలో హిందీ నటుడు అనుపమ ఖేర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ద్వారకకు సంబంధించిన కథా నేపథ్యంలో సినిమా సాగుతుందని టీజర్, ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చాయి.


ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల మీద ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల నిర్మించగా కాలభైరవ సంగీతం అందించారు. దీంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది సినిమా చూసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సినిమా చూసిన వారు ట్విట్టర్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు వారి ప్రకారం సినిమా ఎలా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


కార్తికేయ2 - హిట్‌ లేదా ఎబోవ్ యావరేజ్, మొత్తంమీద మరో బ్లాక్ బస్టర్ లోడ్ అవుతోంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నా ఇంటర్వెల్ నుంచి బాగుంది సినిమా, రేటింగ్ 2.75 - 3 / 5 అని ఒక నెటిజన్ పేర్కొన్నారు.




కార్తికేయ2 సినిమా మొదటి భాగము స్లో పాయిజన్ లాగా మొదలై, క్రమంగా కథ విస్తరిస్తుంది, మంచి ఇంటర్వెల్ బ్యాంగ్, రెండవ భాగం ఎలాంటి లాగ్స్ లేకుండా పర్ఫెక్ట్ సెకండాఫ్ లా ఉంది. ఇక ఇది థ్రిల్లింగ్‌, హై క్లైమాక్స్‌గా చెప్పొచ్చు. మొత్తంమీద 2022లో ఉత్తమ సినిమాలలో ఒకటి రేటింగ్: 4.⅕ అని మరో నెటిజన్ పేర్కొన్నారు. 




మొత్తంగా నెటిజన్ల అభిప్రాయాలని విశ్లేషిస్తే ఫస్టాఫ్‌ డీసెంట్‌గా ఉందని, స్క్రీన్‌ ప్లే చాలా బాగుందని అంటున్నారు. కథ, స్క్రీన్‌ప్లే ఆడియెన్స్ ని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తూందని సెకండాఫ్‌లో బీజీఎం, దర్శకుడి టేకింగ్‌ ఆకట్టుకునేలా ఉన్నాయనేది సుస్పష్టం అవుతోంది. అయితే మొదటి భాగం కాస్త స్లోగా స్టార్ట్ అయినా క్రమంగా కథలోకి వెళ్ళాక ఎంగేజ్ అవుతారని అంటున్నారు. 


Read Also: Prabhas: అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న ప్రభాస్.. ఆ బ్యానర్లో మరో సినిమా!


Read Also: Ranveer Singh: న్యూడ్ ఫోటోషూట్ వివాదం.. రణవీర్ ఇంటికి పోలీసులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook